బ్రహ్మ మురారి సురార్చిత లింగం

 నిర్మల భాషిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
 తత్ప్రణమామి సదాశివ లింగం !!

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.భక్తులందరు ఉపవాసం వుంటారు.సాయంత్రం దేవాలయంలో శివయ్యను దర్శనం చేసుకుని మోక్షం పొందుతారు.శ్రీ శైల మహా క్షేత్రాన్ని దర్శించి వద్దాం పదండి.శివుడు భోళాశంకరుడు అడిగిన వారికి వరాలు ప్రసాదిస్తాడు.పార్వతీ దేవి  శివయ్యని మంచి నివాసం ఏర్పాటు చేయమని కోరగా విశ్వకర్మ చేత లంకా నగరం అతి సుందరంగా నిర్మించిన రావణబ్రహ్మ తపస్సుకు మెచ్చిన రావణుని కోరిక మేరకు లంకను వరముగా ప్రసాదించాడు.
జంగమయ్య,రుద్రుడు,గంగాధరుడని ఎలా పిలిచిన పలికే శివయ్యను మనస్పూర్తిగా పూజంచే అతి ముఖ్యమైనదీ రోజు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాలతో అభిషేకం.

  -తోలేటి వెంకట శిరీష

Leave a comment