తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో సౌకర్యంగా ఉండేలా సరికొత్త ప్యాడ్స్ కు రూపకల్పన చేసింది గీతా సోలంకి. గుజరాత్ కు చెందిన  గీతా సోలంకి సామాజిక ప్రయోజనం ఆశించి పనిచేసే వ్యాపారవేత్త యునిప్యాడ్స్ పేరుతో ఆమె స్థాపించిన స్టార్ట్ ఆఫ్ మోటా వదియ అనే గ్రామంలో ఉంది గత ఆరేళ్లలో ఆమె ఈ స్టార్ట్ అప్ ద్వారా 394 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు చూపించారు. ఆమె మహిళా శిశు అభివృద్ధి శాఖ నుంచి భారత్ కి లక్ష్మి అవార్డు తీసుకున్నది న్యూఢిల్లీ లోని నీతి ఆయోగ్ ఆమెకు ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అవార్డుతో సత్కరించాయి శిశు ప్రసవాల గురించి మహిళల అపోహలను తొలగించే బాధ్యత తీసుకున్న గీత వారికి వచ్చే అనేక ఇన్ఫెక్షన్ లా గురించి స్వయంగా ఎన్నో కథలు విన్నాక యుని ప్యాడ్స్ కంపెనీ రూపకల్పన చేసింది.

Leave a comment