అను కుంజుమన్ కేరళలో తొలి మహిళ బౌన్సర్ గా గుర్తింపు పొందారు కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టిన అను కుంజుమన్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసేది వృత్తిరీత్యా ఒక కార్యక్రమంలో ఫోటోలు తీసేందుకు వెళ్లిన ఆమెకు బౌన్సర్స్ తో పరిచయం అయింది. దేశంలో ఎక్కువమంది బౌన్సర్లు లేరని వాళ్ళు చెప్పిన తర్వాత కొంత శిక్షణ తీసుకుని మహిళా బౌన్సర్ గా ఈవెంట్స్ కు వెళ్తోంది ఆ క్రమంలో ఒక కార్యక్రమానికి మోహన్‌లాల్ కు బౌన్సర్ గా పని చేసిందామె ఈ కార్యక్రమంలో తర్వాత అను కుంజుమన్ వార్తల్లోకి ఎక్కింది. ఫోటోగ్రాఫర్ గా సినిమా నటిగా బౌన్సర్ గా కొనసాగుతోంది అను కుంజుమన్.