సమాజానికి సహాయం చేయటం కోసం యువర్ ఇన్‌స్టా లాయర్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ లో మహిళల హక్కుల గురించి చెబుతున్న బెంగళూరు అమ్మాయి తాన్యా ను డిజిటల్ స్టార్ గా ప్రకటించింది ఫోర్బ్స్ చట్టాలను సామాన్యులకు అర్థమయ్యే భాషలో హాస్య కథలు జోడించి చెప్పటం ప్రత్యేకత. మహిళా సాధికారత చట్టాలు పిల్లల హక్కులతో పాటు మానసిక ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తోంది తాన్యా. ఊహ తెలియని వయసులో మా అమ్మ నాన్న విడిపోయారు. న్యాయవాది అయ్యాక గాని విడాకులు భరణం తీసుకోవాలని మా అమ్మకు తెలియక నానా అగచాట్లు పడిందని తెలుసుకున్నాను. మా అమ్మ వంటి స్త్రీల కోసం నా ఇన్‌స్టా ఖాతాను తెరిచాను అంటుంది తాన్యా.

Leave a comment