ఇండియా లో మొట్టమొదటి మహిళా ట్రక్ మెకానిక్ శాంతి దేవి శారీరిక మైన కష్టంతో కూడిన ఈ వృత్తిలో భర్త తో పాటు పాలుపంచు కుంటే శాంతి దేవిని ఎంతో ఆశ్చర్యంగా చూసారు. ఢిల్లీ లో ఉన్న సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో టైర్లకు పంచ్ కు వేస్తూ కనిపిస్తుంది. 75 ఎకరాల్లో ఉన్న ఈ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో సుమారు 70,000 ట్రక్కులు పార్క్ చేయచ్చు. 20,000 ట్రక్కులు తిరుగుతుంటాయి. టైర్లకు పంచర్లు వేసేందుకు స్థిరపడిన శాంతి దేవి అన్ని వాహనాల టైర్లకు పంచర్లు వేయగలరు. చాలా మంది మగవాళ్ల కంటే నేను బెటర్ మెకానిక్ ని కాకపోతే నేనా పనిచేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తారు. అంటుందామె. ఆటో మొబైల్ రంగంలోకి ముఖ్యంగా ఇప్పటివరకు స్త్రీలు అడుగుపెట్టని రంగంలోకి ఆడవాళ్ళూ ప్రవేశించి ఆ హద్దులు చెరిపేయాలి. ఇదిగో కళ్ళ ముందే స్ఫూర్తి దాత శాంతి దేవి.

Leave a comment