ఆంధ్రప్రదేశ్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నేపథ్యంలో లోక్ సభ లో సంఖ్య పరిశీలిస్తే అంతంత గానే ఉన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దేశ  చరిత్రలో మొదటి సారిగా 62 మంది మహిళలు ఎంపికయ్యారు. 2009 ఎన్నికల్లో గెలుపొందిన మహిళల సంఖ్యా 59. మొత్తం 543 సీట్లలో మహిళలు దక్కించుకున్న సీట్ల సంఖ్య  11.23 గా వుంది. మొట్టమొదటి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల శాతం 4.4 శాతం మాత్రమే. అతి తక్కువ శాతం గెలుపొందింది 1977 లోక్ సభ ఎన్నికల్లోనే . ఆ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల శాతం 3.5 గా వుంది . ప్రపంచ వ్యాప్తంగా 189 దేశాల్లో పార్లమెంట్ లో మహిళల సంఖ్య  గమనిస్తే ఇండియా 111 వ స్థానంలో వుంది. బంగ్లాదేశ్ 19 వ స్థానంలో నేపాల్ 30 వ స్థానంలో వుంది. చట్ట సభలో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని అందరు కోరుకుంటారు కానీ అందుకు ఉపయోగపడే మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం ఇంతవరకు ఆమోదంపొందలేదు .

Leave a comment