మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుసేన్ మునిమనవడి కుర్బాన్ అలీ కుమార్తె ఉర్సిలా అలీ వివాహాన్ని ఢిల్లీలోని జమియా నగర్ లో జాకీర్ హుస్సేన్ స్వగృహంలో జెరిపించిన 79 ఏళ్ల సైదా హమీద్ ఇప్పుడు వార్తల్లో ఉన్నారు. వధూవరులు ఖాజీ సాక్షిగా అంగీకరిస్తేనే ముస్లింలలో నిఖా అవుతుంది. ఎప్పటినుంచో పురుషులే ఖాజీలు గా ఉన్నారు. ఇప్పుడు నిఖా చేసే ఖాజీ మహిళగా ప్రశంసలు అందుకున్నారు. గత పదేళ్లుగా ఆమె రంగంలో ఉన్నారు. 16 నిఖాలు తన ఆధ్వర్యంలో జరిపించారు. కాశ్మీర్ లో జన్మించిన సైదా హమీద్ ముందు నుంచి స్త్రీల విద్య ఉపాధి మతసంబంధమైన హక్కుల కోసం పోరాడుతున్నారు. కెనడా లో చదువుకున్న ఆమె మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పని చేసారు. హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ కి వైస్ ఛాన్సలర్ గా కూడా ఆమె ఉన్నారు.
Categories