ఆగ్వా ఉమెన్ ఫౌండేషన్, ఆగ్వా ఉమెన్ లీడర్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నెట్ వర్క్ విస్తరించింది. 2008లో ప్రారంభమైన ఆగ్వా నెట్ వర్క్ లో తొమ్మిది వేల మందికి పైగా మహిళలు ఉన్నారు. వారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన సాయం నెట్ వర్క్ ద్వారా అందుతుంది అంటుంది శుభా పాండియన్. మహిళాభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ నెట్ వర్క్ నేడు వందల మంది వాలంటీర్స్  సామాజికవేత్త లతో కలిసి పని చేస్తోంది. కాగ్నిజెంట్, అవీవా, సీఎస్‌ఎస్, డియా సెల్యూలార్‌ వంటి పెద్ద కంపెనీలలో ఉన్నతస్థాయి పదవుల్లో పనిచేసిన శుభా అనుభవంతో మరింత మందిని కార్పొరేట్ కెరిర్ లో ఎదిగేందుకు ప్రొఫెషనల్ లీడర్ షిప్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ కార్పొరేట్ వృత్తి నిపుణులు గా తీర్చిదిద్దుతోంది.

Leave a comment