2009లో ఇద్దరు భాగస్వాములతో సేఫ్ హ్యాండ్ 24/7 అనే కంపెనీ స్థాపించింది శ్రావణి పవార్ ఆమె కర్ణాటక లోని ధార్వాడ్ లో పుట్టారు. మహిళా సెక్యూరిటీ గార్డ్ లను ప్రమోట్ చేయడం ఆమె కోరిక. స్త్రీలను విప్పించి వారి మొహమాటం పోగొట్టి శిక్షణ ఇచ్చి వారిని డ్యూటీ లకు పంపే పనిలో మొదట్లో చాలా కష్టపడ్డారు  శ్రావణి. ఆమె సేఫ్ హాండ్స్ సంస్థ లో 60 శాతం మంది మహిళా గార్డ్స్ ఉంటారు. 23 ఏళ్ల వయసులో ఆమె స్థాపించిన ఆ కంపెనీ కి ఇప్పుడు పన్నెండేళ్ళు. ఇప్పుడు హుబ్లీ కేంద్రంగా కర్ణాటక లో పేరుపొందిన ఆ సంస్థ ఆడపిల్లల హాస్టల్స్, హాస్పిటల్స్, విద్యాసంస్థలు అన్నింటికీ మహిళా గార్డ్స్ నే సరఫరా చేస్తోంది. ఎంతోమంది మహిళలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు.

Leave a comment