వంటింటి ఉపకరణాల తయారీ రంగంలో ఉన్నారు నేహా గాంధీ.బెంగళూరు శివారులో ఉన్న హారో హల్లి కి దగ్గర్లో ఉన్న స్టవ్ క్రాఫ్ట్ పరిశ్రమకు డైరెక్టర్.ఇక్కడ పనిచేసేకి ఎక్కువగా మహిళలే భారీ యంత్రాలతో పనిచేస్తూ విడిభాగాలు జోడిస్తూ మిక్సీలు, గ్రైండర్లు, ప్రెషర్ కుక్కర్ లు, నాన్ స్టిక్ కుక్ వేర్ లు తయారు చేస్తారు.తండ్రి రాజేంద్ర గాంధీ చేస్తున్న వ్యాపారంలోకి అడుగు పెట్టింది స్నేహ గాంధీ.మార్కెటింగ్ హెడ్ గా బాధ్యతలు తీసుకొని మహిళలకు మార్కెటింగ్ అవకాశాలు ఇచ్చింది. రీజనల్ సేల్స్ మేనేజర్ గా స్త్రీలనే నియమించింది కిచెన్ అప్లయిన్సెస్  రంగంలో స్టవ్ క్రాఫ్ట్ ను కేరాఫ్ అడ్రస్ గా నిలబెట్టింది.కంపెనీ ప్రతిష్ట పెంచుతూ డైరెక్టర్ అయింది. ఏ పని అయినా మహిళలే శ్రద్ధగా పనిచేస్తారు అంటోంది స్నేహ గాంధీ .

Leave a comment