గౌరీ చౌదరి యాక్షన్ ఇండియా సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ సంస్థ దశాబ్దాల క్రితం ఢిల్లీ లో మహిళా పంచాయతీ వ్యవస్థకు ప్రాణం పోసింది. ఈ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఆరు పంచాయతీలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. గడచిన ఆరేళ్ళ కాలంలో యాక్షన్ ఇండియా సంస్థ పన్నెండు వేలకుపైగా గృహహింస కేసుల్ని పరిష్కరం చేసింది. చాలా కొద్దిమంది కార్యకర్తలలతో ప్రారంభమైన ఉద్యోగం ఢిల్లీ మొత్తం విస్తరించింది. పట్టణ  మహిళలు తన హక్కుల కోసం పోరాడేలా ప్రోత్సహిస్తుందీ సంస్థ. మురికి వాడల్లోని బాలికల భవిష్యత్తు కోసం కూడా కృషి చేస్తుందీ సంస్థ. మురికి వాడల మహిళలకు కోర్టులకెళ్ళే స్థోమత ఉండదు. గృహ హింసను భరిస్తారు. ఈ మహిళా పంచాయతీలు ఈ విన్స్  స్త్రీలకు అండగా నిలబడతాయి.

Leave a comment