పాలిష్ పట్టిన పదార్థాలన్నీ శరీరాన్ని పోషకాలకు బదులుగా కేలరీలతో నింపుతాయి.అలాంటి వాటిలో మైదా మొదటి స్థానంలో ఉంటుంది.జంక్ ఫుడ్ మొత్తం మైదా తోనే చేస్తారు.మైదా అత్యధిక గ్లైకో మిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.దీనితో తయారైన బ్రెడ్, నూడుల్స్ ,పాస్తా తిన్నప్పుడు రక్తంలోకి చక్కెర లు త్వరితంగా విడుదల అవుతాయి అధిక చక్కెర ను నియంత్రించడం కోసం ఇన్సులిన్ స్రావాలు పెరుగుతాయి.ఈ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే టైప్ 2 డయాబెటిస్ బారిన  పడక తప్పదు.సమోసా, నూడుల్స్, కొబ్బరి, చీజ్, పిస్తా మొదలైన పదార్థాలకు కొవ్వులు రిఫైన్డ్ పిండిపదార్ధాలు తోడై శరీర మెటబాలిజం ను అల్లకల్లోలం చేస్తాయి.మైదా కు ప్రత్యామ్నాయంగా గోధుమ పిండి మొక్కజొన్న పిండి వంటి వాటిని ఎన్నుకోవటం మేలు.

Leave a comment