“మాయదారి మైసమ్మొ…మైసమ్మా
        మనం మైసారం పోదమే….మైసమ్మా”!!

శ్రీ శైలం వెళ్ళే రహదారిలో మహబూబ్ నగర్ జిల్లాకు సమీపంలోని క్షేత్రమే మన మైసిగండి మైసమ్మ తల్లి.
మైసమ్మ తల్లి వేపచెట్టు కింద వున్న పాము పుట్టలో వెలసి గిరిజనుల ఆరాధ్య దేవత గా పూజలు అందుకుంటోంది.ఈ తల్లి భక్తుల కలలో కనిపించి తనకు దేవాలయం కట్టించమని ఆదేశించింది.74 స్తంభాలతో వివిధ రకాల ఆక్రుతులతో అతి పెద్ద  మంటపంలో అమ్మ వారు కొలువై ఉన్నది.మైసమ్మ తల్లి కి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.
వామాచారం ప్రదేశం లో అమ్మవారికి కల్లు, సారా,యాటలు సమర్పించుకొని మొక్కులు చెల్లించడం ఆనవాయితీ.అక్కన్న,మాదన్నలు ఈ క్షేత్రంలో అమ్మవారికి,సమీపంలో ఉన్న శివాలయం,రామాలయం కట్టడంలో శ్రమ తీసుకుని భక్తులకు సంతోషాన్ని కలిగించారు.ప్రతి ఆదివారం ఆషాఢమాసంలో  అమ్మవారికి బోనంతో దర్శనం చేసుకుని ప్రసాదం నైవేద్య పెట్టి అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తారు.

ఇష్టమైన రంగుల: ఎరుపు, ఆకు పచ్చ
ఇష్టమైన పూలు:  అన్ని రకాల పుష్పాలు
ఇష్టమైన పూజలు: మేక,కోడిని బలి ఇవ్వడం
నిత్య ప్రసాదం: కొబ్బరి, నిమ్మకాయల దండ, చద్ది.

           -తోలేటి వెంకట శిరీష

Leave a comment