చేసుకొన్న అలంకరణ చెదిరిపోకుండా ఉండేందుకు మేకప్ అంతా అయ్యాక మేకప్ స్ప్రే ని వాడాలి అంటారు నిపుణులు. దీన్ని మేకప్ సెట్టింగ్ స్ప్రే అంటారు. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రెండు స్పూన్ల్ వెజిటబుల్ గ్లిజరిన్ తిసుకొని దీన్ని పెద్ద సీసా నీళ్ళలో కలపాలి. ఒకదానిలో ఒకటి కలిసేట్టు గిలకొట్టాలి . కాస్త దూరం దూరంగా పడేలా దీన్ని స్ప్రే సీసాలో పోసి చల్లితే అలంకరణ సరిగ్గ సరిపోతుంది. అలాగే ఒక స్ప్రే సీసాలో రెండు స్పూన్ల్ గ్లిజరిన్ ,గులాబినీరు విటమిన్-ఇ నూనె కలిపి బాగా కాలుపెట్టి గిలకొట్టి అలంకరణ సెట్ అయ్యేలా మొహం పైన చల్లుకోవచ్చు. ఇదే వెజిటబుల్ గ్లిజరిన్ లో గులాబీ నూనె ,నీళ్ళతో పాటు ఓ చుక్క టెట్రి నూనె కలిపితే ఇంకా మంచిది. దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకొని నాలుగు వారాల పాటు వాడు కోవచ్చు. ఇది మేకప్ స్ప్రే లాగానే కాదు మాములుగా మొహానికి చల్లుకొన్న మొహం తాజాగా వుంటుంది.
Categories