Categories
పార్టీ లో ఫోటోలు బాగా రావాలంటే కొన్ని మేకప్ టిప్స్ ఇస్తున్నారు ఎక్సపర్ట్స్. జుట్టు ముందు భాగంలో కాంటూరింగ్ (contouring) చేయటంవల్ల నుదురు చిన్నగా అనిపిస్తుంది. ముక్కు సన్నగా కనిపించాలంటే ముక్కు రెండు వైపులా కాంటూరింగ్ చేయాలి ముక్కు దూలం హైలెట్ చేస్తే ముక్కుసూటిగా కనిపిస్తుంది. పెదవుల మధ్యలో లిప్ స్టిక్ చిక్కగా వేసే పెదవులు పూర్తి షేప్ లో కనిపిస్తాయి. దవడ ఎముకలు అడుగున కాంటూరింగ్ చేస్తే ముఖం ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. దవడ కండరం కింద భాగంలో కాంటూరింగ్ చేస్తే ముఖం ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. కాంటూరింగ్ అంటే చర్మం రంగు కన్నా లేత లేదా ముదురు రంగులు వేయటం దీని వల్ల ముఖం ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది.