చూసేందుకు వాటర్ డ్రాప్ షేప్ లో ఉండే ఈ మేకప్ బ్లెండర్ తో మేకప్ వేసుకోవటం సులభం దాన్ని ఉపయోగించటం తేలిక కూడా.ఈ బ్లెండర్ ను పొడిగా వాడకూడదు. నీటిలో ముంచి గట్టిగా పిండేయాలి.ఈ నీటి చుక్క ఆకారంలో ఉండే బ్లెండర్ తో ఫౌండేషన్ కన్సీలర్ వేసుకోవడం చాలా సులభం ఫౌండేషన్ ను మొహం పై చుక్కలు చుక్కలుగా పెట్టుకొని బ్లెండర్ తో పైపైన అద్దితే అది సమంగా పరుచుకుంటుంది ప్యాచ్ లాగా కనిపించకుండా సహజంగా ఉంటుంది. బ్లండర్ ఒకవైపు గుండ్రంగా ఇంకోవైపు కొనదేలి ఉంటుంది. కళ్లకింద  కన్సీలర్ ను ఈ కొనవైపు భాగంలో వేసుకోవచ్చు మేకప్ పూర్తయ్యాక ఈ బ్లెండర్ ను నీటితో కడిగేస్తే చాలు.

Leave a comment