ఎలాంటి మేకప్ వేసుకొన్న ముందు చర్మం శుభ్రాంగా ఉండాలంటారు మేకప్ ఎక్సపర్ట్స్. కనుక చర్మపు పీహెచ్ వాల్యూ కి తగిన సబ్బుతో, లేదా ఫేస్ వాష్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. చక్కెర స్క్రబ్ తో పెదవుల పైన మృత చర్మాన్ని వదలించుకొన్నాకే పెదవులకు లిప్ మాస్క్ వేసుకోవాలి. చర్మం తేమ పోకుండా మన్నికైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇలాంటి స్కిన్ ప్రిపరేషన్ తరువాత మేకప్  వేసుకుంటే మేకప్ చర్మంపైన సమంగా పరచుకొని ఉంటుంది. చర్మానికి తగిన ప్రైమర్ ఎంచుకోవాలి. అలాగే లాంగ్ వేర్, ట్రాన్స్ ఫర్ స్వేట్ రెసిస్టెంట్ ఫార్ములా తో కూడిన ఫౌండేషన్ ఎంచుకోవాలి. మొటిమలు, కళ్ళకింద వలయాలు దాచటం కోసం కన్సీలర్ ఉపయోగించాలి. ముక్కు చుబుకం బుగ్గలు నుదురు ప్రదేశాల్లో హై లైటర్ వాడుకుంటే ముఖం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

Leave a comment