14వ సంవత్సరం కూడా రాకుండానే ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది మలావత్ పూర్ణ.ఆ తరువాత సంవత్సరాల్లో దక్షిణాఫ్రికా లోని కిలీమంజారో రష్యాలోని ఎల్ బ్రుస్ , దక్షిణా అమెరికా లో అర్జెంటీనా లోని అకోంకాగ్య పర్వత శ్రేణిని ఎక్కేసింది. ఈ యువ సాహాసి తెలంగాణ గురుకుల సంక్షేమ పాఠశాలలో చదువుకొంటూ ట్రెక్కింగ్ సాధన చేసింది. ఆమె పుట్టిన ఊరు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం ,తల్లిదండ్రులు రోజు కూలీలు . ఎలాంటి ప్రోత్సహాం ,ఆర్థిక వెసులు బాటు లేని చోట నుంచి ఇంత సాహాసయాత్ర చేసింది. పట్టుదల ఉంటే వయసు ,డబ్బు ఇతర ఇబ్బందులు ఏవీ అడ్డంకులు కావాని నిరూపించింది పూర్ణ.

Leave a comment