ఇది మల్లెల మాసం. ఎండల్లో దొరికే అద్భుతమైన పూలు ఇవి ఈ సువాసనల మల్లెలలో సౌందర్య పోషణ చాలా ఈజీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు కూడా మల్లెలు ఎండబెట్టి పొడి చేయాలి. అందులో పాలు ముల్తాని మట్టి, ఓట్స్ కలపాలి. దీన్ని ముఖానికి రాసి మర్దనా చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. అలాగే కొన్ని బంతి రేకులు, గులాబీ పువ్వులు కలిపి ముద్దగా చేసి అందులో కాస్త పెరుగు కలిపి పుతలా వేసుకోవచ్చు. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఎండ కారణంగా పేరుకొన్న నలుపుదనం పోతుంది. అలాగే గులాబీ రేకుల్ని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. అందులో కాస్త గోధుమ పిండి, పెరుగు కలిపి నిగారింపుతో వుంటుంది. ఈ పూత వల్ల చర్మానికి తేమ అంది మృదువుగా మారుతుంది. మందార ఆకుల్ని ఎండ బెట్టి పొడిగా చేసి ఆ పొడిలో పెరుగు చందనం కలిపి ముఖానికి మెడకి ప్యాక్ వేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారిపోతుంది. ఈ పూల ప్యాక్ లు పార్లర్ వేసిన ఫేస్ ప్యాక్ ల కంటే బాగా పని చేస్తాయి.
Categories
Soyagam

మల్లెల ప్యాక్ తో మోహంలో కాంతి

Leave a comment