ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయని హెచ్చరిస్తూన్నారు డాక్టర్లు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు వేడి చేయకూడదని చెపుతున్నారు. చికెన్ బచ్చలి కూర గుడ్డు బంగాళా దుంపలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి చేసి తినకూడదు. జంక్ ఫుడ్ విషయంలో ఈ పదార్ధాల్లో మొత్తం మళ్ళీ మళ్ళీ వేడి చేసి ఇస్తూనే ఉంటారు. కట్ లెట్స్ సమోసాలు ఎప్పుడో ఉదయం చేసి పెట్టినవే కష్టమర్స్ అడగ్గానే వేడి చేసే ఇస్తుంటారు. వేడిగా తినేటప్పుడు మిగతా విషయాలు దాదాపు పట్టించుకోము. సాంబారులో వేసే దుంపలు ముక్కలు కూడా వేడి చేయటంలో మొత్తం పోషకాలు పోతాయని అనారోగ్యాలు వస్తాయని చెపుతున్నారు. ఒకసారి వండిన అన్నాన్ని వేడి చేస్తే బాక్టీరియా పునరుత్పత్తి అవుతుందిట. అంటే అన్నాన్ని వండే క్రమంలో నశించిన బాక్టీరియా దాన్ని తరిగి వేడి చేయటంలో జీవం పోసుకుంటుంది . ఇదే క్రమం జంక్ ఫుడ్ విషయంలో కూడా జరుగుతుందని చెపుతున్నారు.
Categories
WhatsApp

మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే చాలా నష్టం

Leave a comment