ఏ నాటివో పాత నగలు మళ్ళీ కొత్త ఫ్యాషన్ ట్రెండ్ గా వచ్చేసున్నాయి ఒకప్పుడు కాళ్ళ పట్టీలు, చెవులకు బుట్టలోలాకులు ఫ్యాషన్ ఇప్పుడు కుందన్ పనితనం వున్న బంగారు నగల ఫ్యాషన్. ఇప్పుడు కుందన్ పనితనం వున్న బంగారు నగలు ఫ్యాషన్. అలాగే పాత కాలపు పసిడి బిళ్ళలు ఫ్యాషన్ లిస్టులో ముందున్నాయి. రాళ్ళు పొదిగిన పెండెంట్ చైన్స్ మళ్ళీ ఫ్యాషన్ వరసలో వున్నాయి. గోల్డ్ బ్రెస్ లెట్లు స్దానంలోని వజ్రాలు సీజెడ్ లు పొదిగిన నగలోచ్చాయి. వెండి నగలు కుడా మళ్ళీ తెర ముందుకు వచ్చినట్లే  అయితే పెద్ద సైజు వెండి ఆభరణాలు చూసేందుకు బావుండవు. వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కి కుడా ఇప్పుడు డిమాండ్ వుంది. కానీ ఈ నగల ప్లేస్ లో వెండి నగల్ని ఇష్టపడుతున్నారు కాలేజీ అమ్మాయిలు. ముక్కు పుడకలు, చెంప స్వరాలూ పాత ట్రెండే అయితే చక్కని దిద్దులతో పాటు చెంపస్వరాల కంటే మెరిసే రాళ్ళదే లేటెస్ట్  ఫ్యాషన్ అరవంకీ, తేలికైన వడ్డానం కుడా మోడ్రన్ ట్రెండ్.

Leave a comment