కనుబొమలు థ్రిడింగ్ చేయించు కొంటే చాలా తీరుగా ఉంటాయి . అవి నిండుగా కనిపించాలి అంటే కొద్దీ పాటి జాగ్రత్త తీసుకోవాలి . కనుబొమల్ని ఐ బ్రో పెన్సిల్ తో దిద్దుకోవాలి . వాటికోసం వాడే బ్రష్ తో దువ్వినట్లు చేయాలి . ముఖంపై పేరుకున్నా మృతకణాలు పోయేందుకు స్క్రబ్ వాడినట్లు కనుబొమల చుట్టూ క్రీం రాసి మదన చేస్తే కనుబొమల భాగం పొడిబారకుండా మెరుస్తూ ఉంటుంది . పెట్రోలియ జెల్లీ రాసి మధన చేసినా పర్లేదు . ఆముదం కొబ్బరి నూనె ప్రతి రాత్రి రాసి మధన చేస్తే వెంట్రుకలు పెరుగుతాయి . ఇంట్లో చాలా మితంగా ప్లకింగ్ చేయాలి . అదే పనిగా తొలగిస్తే అవి మళ్ళీ పెరగక పోవచ్చు ఆకృతి సరి చేసుకోవటం కోసం అంచుల్ని మాత్రం కొద్దిగా కత్తిరించుకోవచ్చు .

Leave a comment