తమిళ, తెలుగు, మళయాళ చిత్రాల్లో నటించిన లిజీ పెళ్ళయ్యాక సినిమాలు మానేసింది. కూతురు లావణ్య, అఖిల్ కలిసి నటిస్తున్న సినిమాలో మళ్ళీ సినిమాల్లోకి అడుగు పెట్టింది లీజీ. అలాగే నితిన్ సినిమాలో హీరొయిన్ తల్లిగా నటిస్తుంది. దీన్ని గురించి ఆమె మాట్లాడుతూ పాతికేళ్ళ తర్వాత కెమెరా ముందుకు వచ్చాను. న్యుయార్క్ లో తోలి సారి షూటింగ్ లో పాల్గొన్నాను. నాది ఈ సినిమాలో చాలా మంచి పాత్ర ప్రేక్షకులు మళ్ళీ ఆదరిస్తారని నాకెంతో నమ్మకం వుంది. నేను నటించిన అనిమిది తెలుగు సినిమాల్లో ఆరు హిట్ అయ్యాయి. అప్పుడు టాలీవుడ్ ను వదిలినందుకు చాలా బాధగా వుంది. ఎన్ని కష్ట సుఖాలు చూసినా ఫైనల్గా మళ్ళీ రంగు వేసుకున్నందుకు సంతోషంగా వుంది అని చెప్పుతుంది లిజీ. రాజశేఖర్ హీరోగా మగాడు, 21 వ శతాబ్దం లో సుమన్ హీరోగా లిజీ నటించిన చిత్రాలు అప్పట్లో సూపర్ హిట్.

Leave a comment