మళ్ళీ సినిమా చేయడం హ్యాపీ, వెరీ హ్యాపీ టూ బిగెన్ అంటుంది నివేదా థామస్. ఈ మధ్యే ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పూర్తి చేసిన నివేదా చదువు కోసమే సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఐదేళ్ళ చదువు ప్రయాణాలు ముగిశాయి. కాలేజ్‌ టూర్‌ మిస్ అవ్వకూడదని సినిమా డేట్స్ కూడా రీ షెడ్యూల్ చేసుకున్నా. సెట్స్ లో డ్రాఫ్టింగ్ చేసుకునేదాన్ని , ఫ్లైట్ లో స్కెచ్ గీసుకునేదాన్ని సెమిస్టర్ సెలవుల్లో సినిమాలకు డేట్స్ ఇవ్వడం కొన్ని సార్లు అసలు ఏమి ఇవ్వలేకపోవడం లాంటి అన్ని సమస్యలతో నెట్టుకొచ్చి ఎలాగో డిగ్రీ పూర్తి చేశా. స్టడీ బ్రేక్స్, మూవీ బ్రేక్స్ తో నా ప్రయాణం ఇప్పటివరకూ సాగింది అంటుంది నివేదా థామస్. కళ్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాలో నటిస్తుంది నివేదా.

Leave a comment