నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నా కల నిజం అవుతోంది.ఈ పరిశ్రమకు తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలనే ఆలోచనలో ఈ నిర్మాణ సంస్థను ఆరంభించాను నా పేరు తోనే నా నిర్మాణ సంస్థ కొనసాగుతోంది.అంటూ తన కొత్త బిజినెస్ గురించి చెబుతోంది మమతా మోహన్ దాస్. మలయాళం కన్నడ తెలుగు చిత్రాల్లో నటించిన మమతా భారతీయ చిత్రాల్లో ప్రశంసలు పొందిన ప్లే బ్యాక్ సింగర్. తెలుగు చిత్రం రాఖీ లో టైటిల్ సాంగ్ ఆమెదే.ఆ పాటకు అవార్డ్ కూడా తీసుకుంది. మమతా క్యాన్సర్ ను జయించిన ఈ విజేత ఇప్పుడు నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు మంచి సినిమాలు తీసుకొస్తానని చెబుతోంది.

Leave a comment