Categories

యోగర్ట్ లో మాంసాహారం కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయనుకోవటం అవాస్తవం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇందులో సాధారణ పెరుగు కంటే కాస్త ప్రోటీన్ అధికం కానీ మార్కెట్ లో దొరికే యోగర్ట్ లో అనేక ఫ్లేవర్ లు కలుపుతారు కనుక అసలు వాటి వాడకం మంచిదే కాదు. యోగర్ట్ లో తీపి కోసం చేర్చే చక్కెర ఇతర పదార్థాలు క్యాలరీలు ఎక్కువే ఉంటాయి. ఈ యోగర్ట్ కంటే మామూలు వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు కొవ్వు తక్కువగా ఉండే పనీర్, సోయా పనీర్, రాజ్మా, అలసందలు,చిక్కుళ్ళ లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి పైగా వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం కూడా.