ప్రకృతి మనిషికి ఇచ్చే బహుమతుల్లో నురగలు కక్కుతూ జలజలా పారే జలపాతాలు ఒకటి ఎతైన కొండల్లోంచి విసురుగా కిందికి దుకే జలపాతాలు ప్రపంచంలో చాలాచోట్ల ఉన్నాయి కానీ చైనా లోని యువన్ ప్రావిన్స్ జలపాతం మాత్రం ప్రకృతి ఇచ్చిన సంపద కాదు. ఇది ఆసియా లోనే అతి పెద్దదైన మానవ నిర్మిత జలపాతం. స్థానిక న్యులాన్ నదిలోని నీటిని డియంచి అనే సరస్సుల్లోకి మళ్ళిస్తే వరదల సమస్య, నీటి సమస్య రెండు ఉండదని భావించి 1100 కోట్లతో ఈ జలపాతం నిర్మించారు. సరస్సులోకి మళ్ళించే నీటిని మాములు ప్రవాహంలా కాకుండా జలపాతం లాగా పడేలా చేశారు. 12.5 మీటర్ల ఎత్తు 400 మీటర్ల వెడల్పుతో ఈ జలపాతం పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది.