మన ఇల్లు మన అభిరుచిని మనం చెప్పకుండానే చూపించగలగాలి. అందమైన ఇల్లు ముందు చక్కని షెల్ఫ్ లు అందులో మనం చదివిన పుస్తకాలతో నిండి ఉండాలి. ఇప్పుడు పర్యవరణ హితమైన గ్రీన్ వాల్స్ వాడకం ఎక్కువైంది. కలప వెదురుతో గోడలు అలంకరిస్తున్నారు. స్టడీ రూంలో గోడలు చెక్క,ఫ్లై ఉడ్ తో ఏర్పాటు చేసుకుంటే మంచి లుక్ వస్తుంది. వంట గది హాలు ఇటుక ముక్కలు లేదా రాళ్ళతో చేసిన గోడలు చక్కని రూపం ఇస్తాయి.  ఇమిటేషన్ బ్రిక్స్ పెయింటింగ్ కూడా బావుంటుంది.  వాల్ ఫినిషింగ్ కోసం అందమైన మెటీరియల్ వస్తుంది. తలుచుకుంటే ఇల్లే అందమైన ప్రకృతి దృశ్యంలా మార్చేయవచ్చు.  అయితే ఈ మెటీరియల్ కు మంటలు వ్యాప్తి చేసే గుణం ఉండకూడదు. అలాగే గోడకు అంటించిన వాల్ డెకరేషన్ పేపర్స్ తడిసినా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. హాల్లో చక్కని పెయింటింగ్స్ ఎంతో అందం ఇస్తాయి.

Leave a comment