మంగళవారం హనుమంతుడు తో పాటు దుర్గా దేవిని కూడా పూజించవచ్చు.సకల సౌభాగ్యాలకు మూలం దుర్గా దేవి అనుగ్రహం కలగడం.మంగళవారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి పూజ మొదలు పెట్టుకోవాలి. ముందుగా కాళ్ళకి  పసుపు రాసుకుని,జుట్టు ముడిచి,పూజించాలి.దుర్గ దేవి ని శ్రద్ధగా,నిష్ఠగా,నిశ్చలమైనమనసుతో ఆరాధించాలి.ముఖ్యంగా ముత్తైదువతనానికి పవిత్రమైన పూజ.ఇంటికి వచ్చిన వారికి పసుపు-కుంకుమ,రవిక,పూలు,పండ్లు,ఎరుపు/ ఆకు పచ్చ గాజులు,ఆకు- వక్క ఇచ్చి నమస్కరించిన అమ్మవారి కటాక్షం తథ్యం!!

ఇష్టమైన రంగు:ఎరుపు
ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందంతో సువాసనల మధ్య  మెరిసిపోతూ ఉంటుంది అమ్మ వారు.
దుర్గ దేవి వాహనం: పులి
నిత్య ప్రసాదం: కొబ్బరి,బెల్లం పొంగలి,దద్ధోజనం.
బెల్లం పొంగలి:సగం కప్పు పెసర పప్పు, ఒక కప్పు బియ్యం అరగంట నానబెట్టి,కడిగి,ఉడికించి  పక్కన పెట్టుకోవాలి,సగం కప్పు బెల్లం,ఒక కప్పు పంచదార కడిగి నీళ్ళలో నానబెట్టి పాకం తయారు చేసుకోవాలి.దానిలో ఉడికించిన అన్నాన్ని  కలిపి, యాలకుపొడి, వేయించిన జీడిపప్పుతో అమ్మవారికి నైవేద్యం తయారు.
దద్ధోజనం తయారీ: ఉడికించిన అన్నంలో గట్టి పెరుగుకొద్దిగా పాలు పోసి,తగినంత ఉప్పు వేసి మూకుడు లో నెయ్యి వేసి, కొద్దిగా వేడి అయ్యాక శనగ పప్పు, ఆవాలు,జీలకర్ర,ఎండుమిరపకాయల్ని మిరపకాయలతో పోపు వేసి ఫైనల్ గా వేయించిన జీడిపప్పుని అలంకరిస్తే చాలు దుర్గా దేవి అనుగ్రహం కలగడంతో మన పూజలకు పుణ్యం లభిస్తుంది.
“అయిగిరి నందిని నందిత మేదిని
          విశ్వ వినోదిని నంది నుతే
           గిరి వర వింధ్య శిరోధి నివాసిని
           విష్ణు విలాసిని విష్ణు నుతే”!!

                                       — తోలేటి వెంకట శిరీష  

 

Leave a comment