బ్రహ్మమురారి సురార్చిత లింగం

నిర్మల భాసిత శోభిత లింగం

 జన్మజ దుఃఖ వినాశక లింగం

తత్ప్రణమామి సదా శివ లింగం!!

శివుడాగ్న లేనిదే చీమైన కుట్టదు..మనందరికీ తెలిసిన విషయమే!!
శివుడికి ఆర్భాటాలు అవసరం లేదు. విభూతి పెట్టుకుని శివ-శివ అని స్మరిస్తే చాలు…భోళాశంకరుడు ప్రత్యక్ష మవుతాడు.
శివుడికి శిరస్సున చందమామ, గంగమ్మను,మెడలో హారములుగా సర్పాలు,నడుముకు పులి చర్మాలే అలంకారం.నీలకంఠుడు అభిషేక ప్రియుడు.
పుష్పాలతో పూజకన్నా విభూతి పూజ ఇష్టం.
ముందుగా నందీశ్వరుని అఙ్ఞ లేనిదే శివయ్య దర్శనం జరగదు. త్రినేత్రుడు నటరాజ రూపంలో తాండవం చేయడం నటనాభినయనానికి నాంది.నాట్యానికి సృష్టి కర్త.అభినయానికి అధిపతి.ఆయనకు ప్రత్యేక ప్రసాదం అవసరం లేదు నృత్యం చేస్తూ స్తుతించిన చాలు.
ఇష్టమైన పూలు:అన్ని రకాలైన పూలుతో పూజ.శివలింగం ను అభిషేకించి గంధంతో ఆరాధించి.ఇష్టమైన పూల మాల తో అలంకరిస్తే చాలు  ఈశ్వరుడి కటాక్షం తథ్యం.
పూజకి పవిత్రమైన రోజు: సోమవారం.
ఈశ్వరుని ప్రసాదం: కొబ్బరి,అన్ని రకాల పండ్లు,పంచామృతము.
పంచామృతము: తేనె,ఆవు నెయ్యి,ఆవు పాలు,పెరుగు, పంచదార.
!! ఓం నమశ్శివాయ!!
      -తోలేటి వెంకట శిరీష

Leave a comment