కొండను తవ్వి ఎలకను పట్టినట్లు అంటారు పెద్దవాళ్ళు. ఒక పెద్ద కొండను తవ్వాలనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొంటే అంత కష్ట పడ్డాక దాని ఫలితం అంత స్థాయిలో ఉండకపోతే నవ్వులపాలు అవుతారు. ఎంతో గొప్పగా మాట్లాడి దానికి తగ్గ చేతలు లేకపోతే మాటలే వెక్కరింపు అన్నమాట ఈ సామెత. గొప్ప కొండను తవ్వేసి,ఒక చిన్న ఎలుకను పట్టినట్లుగా ఎన్నో డాంబికాలు పలికి ఫలితం ఏమీ చూపెట్టలేదు అని ఈ సామెతకు అర్ధం. పెద్దవాళ్ళు ఎం చెపుతున్నారు అంటే ఉపయోగం లేని పనికి మాలిన కబుర్లు చెపుతూ కాలక్షేపం చేసే వాళ్ళను,నువు చెప్పే అతిశయోక్తులు ఇలా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉన్నాయి అని వెక్కిరిస్తున్నారు .

Leave a comment