‘ అత్త ఒకరింటి కోడలే ‘  అన్న సామెత ఎవరినోట నుంచి పలికిందో కానీ అది ఏ తరం లో అయినా గుర్తు చేసు కోవలసిన మాట.
అత్తగారికి,కోడలికి నిజానికి తల్లీ బిడ్డలకు వుండే బాంధవ్యం ఉండాలి. కానీ తరతరాల నుంచి వచ్చిన కోడలు తన ఇంటిలో పెత్తనం చేస్తుందనీ,కొడుకుని తనవాడిని చేసుకొంటుందనీ అత్తగారి భయం అలాగే అత్తగారు తనను సవ్యంగా కాపురం చేసుకోనివ్వదని కోడలి అనుమానం వయసులో పెద్దది కనుక అత్తగారే కోడలిని అదుపులో పెట్టాలని చూస్తుంది. ఆ వైరం చూస్తున్న పెద్దవాళ్ళు అత్తగారిని హెచ్చరిస్తూ ఈ సామెతని సృష్టించి వుంటారు. తాతగారైన ఒకప్పుడు ఇంకో ఇంటికి కోడలిగా వచ్చిన మనిషే కదా ఆ రోజు నిన్ను నీ అత్తగారు ఎలా చూసిందో,కష్ట పెట్టుకొని ఉంటావో,కాస్త గుర్తు తెచ్చుకొని కోడలిని బాగా చూసుకోవాలని అర్ధం.

సేకరణ
                                                                                               సి.సుజాత 

Leave a comment