Categories
కెరీర్ అన్నాది ఎవ్వరూ బహుమతి గా ఇవ్వరు అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్ . అందరూ హీరోయిన్ ల పాత్రలే ధరించాలని లేదు . నాకెందుకో విలన్ పాత్రలూ అంతే బలమైనవి గానే అనిపిస్తాయి . కాకపోతే వెండి తెరపైన కనిపించేంత క్రూరత్వం మాత్రం నా మనసు మూలల్లో వెతికినా కూడా కనిపించదు నేను చాలా సాఫ్ట్ . ఇదంతా నాకెరీర్ ఇది మనకు ఊరికే రాదు ,ఎవ్వరూ మననుంచి లాక్కోలేరు. ఇది మన పని మన దృక్పధం అదృష్టం కూడా . ఇదే పరిశ్రమ లో మన స్థానాన్ని నిర్ణయిస్తుంది అంటుంది ఎంతో ఆత్మవిశ్వాసం తో వరలక్ష్మి . చిన్నప్పటి నుంచి మా నాన్న చేసే ప్రతి పాత్రా నాలో ఎంతో స్ఫూర్తి కలిగించాయి . అందుకే నేను నటించే పాత్రలో నా నటనకు ఎంత స్కోప్ ఉందో చూసుకోవటం అలవాటైంది . నిజానికి ఆ ఆలోచనే నన్ను నిలబెట్టింది అంటోంది వరలక్ష్మి .