Categories
Nemalika

మనకోసం సమయం మ్మిగుల్చుకోవాలి.

నీహారికా,

ఎంతటి అంతులేని పనులున్నా మన్యుష్యులకు పర్సనల్ టైమ్ అంటూ వుండాలి. ఒంటరిగా మనలోకి మనం చూసుకోగలిగే తీరిక వుండాలి. అందుకే రోజులో ఓ అరగంట పాటైనా వంటరిగా గడిపితే చక్కగా ఆలోచించగలిగితే ఎన్నో సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. మంచి ఆత్మ విశ్వాసం వస్తుంది. అలాగే ఎంత వంటిల్లో పనులు ఎదురు చూస్తున్నా సరే ఉదయాన్నే లేచీ లేవంగానే పనుల్లోకి జారబడిపొతే మనకు బరువు తీరుతుంది. ఓ అరగంట ముందే లేచి కాస్త పచ్చని చెట్లను చూస్తూ నడవగలిగితే మెదడు చురుకుగా పని చేస్తుంది. అలాగే చురుకైన ఆహారం కుడా వుంటుంది. వేపుళ్ళు, స్వీట్లు మొదలైనవాటి కంటే గ్లైనమిక్ ఇండెక్సో తక్కువగా వుండే ఆహార పదార్ధాలు తీసుకుంటే శరీరానికి శక్తి అంది ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే శరీరానికి మంచి విశ్రాంతి దొరకాలి, కంటి నిండా నిద్రపోవాలి. నిద్రలో అలసట తీరి కొత్త శక్తి వస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేలా మెదడు, శరీరం ఒక అవగాహనతో కలిపి పనిచేస్తాయి అంటే మంచి ఆలోచనలు మెదడుకు అంది మంచి శక్తి శరీరానికి దొరికి రెండు ఆరోగ్యంగా ఉంటాయన్న మాట. అందుకే ఒక పార్సనల్ ట్రిమ్ మిగుల్చుకోవాలి.

Leave a comment