నిహారికా,మనందరికీ మన గురించి ఇతరులు ఎమనుకుంటున్నారో అని ఆలోచన ఉంటుంది.అందుకే ఎప్పుడు ఇతరులను మెప్పించేలా మాట్లాడటం ,ప్రవర్తించడం చేస్తాం.కానీ మనల్ని మనం పోగోట్టుకుంటే నష్టం కదా. ఎవరి అంగీకార,ఆమోదాల కోసం చూస్తామో వాళ్ల లోనూ లోపాలు ఉంటాయి. ఇతరల ఆలోచనలతో మనకు నిమిత్తం లేదు.వాళ్లు మన గురించి ఎమనుకుంటున్నారో నిజంగానే మనకి అనవసరం.మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మన జీవితం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో,ఎలా జీవిస్తున్నామో అది కేవలం మన ఇష్టం,మన వ్యక్తిగతం .ఎదుటివాళ్లను మనం నియంత్రించలేము కనుక వాళ్లను వాళ్లదారిన వదిలేసి మనకు నచ్చినట్లు మనం ఉండటం శ్రేయస్కరం.మన గురించి మనం తక్కువ అంచనాలు వేసుకోకూడదు.

Leave a comment