Categories
శ్రుతి తారాయిల్ కు పూర్వికులు ఆహారంగా తీసుకున్న ఆకులు పండ్ల పైన పరిశోధనలు ఇష్టం. ఎంతో రీసెర్చ్ తర్వాత ఇన్స్టా లో ఫర్ గాటెన్ గ్రీన్స్ ప్రారంభించారు. ఎన్నో మొక్కలను పండ్లను ఆకులను పరిచయం చేస్తూ ఆసక్తి ఉన్నవారికి అడవుల్లో వాక్స్ కోసం తీసుకుపోతుంది శృతి. మ్యాప్ ద వైల్డ్ పేరుతో ఓ గేమ్ కిట్ ను తయారు చేశారు. సైకిల్ పైనే ప్రయాణం చేస్తూ మొక్కలపై పరిశోధనలు చేస్తారు. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ 700 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేస్తూ ఎన్నో మొక్కలను, పండ్లను, ఆకులను పరిశోధించారు.ఈ సృష్టిలో పనికిరాని మొక్క ఉండదు అంటారు శృతి.