ఇప్పుడు వంటిల్లు కూడా కళాత్మకంగా వుండేలా మాడ్యులర్ కిచెన్స్ వచ్చేశాయి. పాత ఇల్లు కొత్తగా డిజైన్ చేయించుకోవాలంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఆర్ధికమైన అంశాల్ని దృష్టిలో ఉంచుకొని అవసరాలకు సూటయ్యే విధంగా డిజైన్ చేయించుకోవాలి. మాడ్యులర్ కిచెన్ లో షెల్ఫులు, సోరుగులు ముందే ఎన్ని కావాలో రాసుకోవాలి. అన్ని అప్లియిన్స్ కు విడిగా బడ్జెట్ చూసుకోవాలి. ఎంచుకొనే కంపెనీల గ్యారంటీ టర్మ్స్, నిర్వహణ పద్ధతులు చూసుకోవాలి. ఏడాది గ్యారంటీ అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. సోరుగులు తెరిచే పద్ధతి సౌకర్యంగా సులభంగా ఉండాలి. కలర్ కాంబినేషన్స్, టైలింగ్, ఫ్లోరింగ్ వంటివి చూసుకోవాలి, కొన్ని కంపెనీలు ఎకో ఫ్రెండ్లీ షెల్లింగ్ యూనిట్లు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఫిట్టింగ్ లో ఎనర్జీ అంశాలు పరిశీలించాలి. ఇంటర్నేషనల్ కంపెనీలో ఆర్డర్ ఇచ్చాక 90 రోజులు డెలివరీ ఇచ్చే టైం తీసుకొంటాయి. రెండేళ్ళ క్రితం ఇవి రెడీమేడ్ గా దొరకటం ఒక వింత. ఇప్పుడన్నీ అలవాటయ్యాయి కాబట్టి ఇవి మాన్ సొంతంగా మనకు కావలిసినవన్నీ విడిగా ఆర్డరిచ్చి కూడా అమర్చుకోవచ్చు. కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన సెట్టే ఇస్తారు గనుక అవి మనకు పనికి వస్తాయో రావో, అన్నీ ఉపయోగించుకోగాలమో లేమో చూసుకోవాలి.

Leave a comment