నిస్సందేహంగా సమంత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ప్రేమస్వరూపురాలు అని చెపుతారు. ఈ మధ్య కాలంలో తను చేసిన పాత్రలన్ని ఆమెను వెండి తెర రాణిని చేశాయి. అలాగే ఆమె నిజ జీవితంలో ఎంత స్మార్ట్ గా బిహేవ్ చేస్తుందో ఒక చిన్న ఫోటో సోషల్ మిడియాలో హల్ చల్ చేసింది. ఒక షుటింగ్ గ్యాప్ లో మేకప్ లో ఉన్న సమంత తర్వాత సీన్ కోసం ఎదురు చూస్తూ కేరవాన్ లోకి వెళ్ళకుండా ఒక కుర్చిలో హాయిగా సేద తీరటం ఆ ఫోటోలో కనిపిస్తుంది. ఆమెను డిస్ట్రబ్ చేయకుండా ఆమె టీమ్ ఆమె చుట్టు ఉన్నారు. మహానటి సినిమాలో ఒక పాత్రికేయురాలి పాత్ర పోషిస్తుంది సమంత. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ ఇంద్రాక్షి ఆమెను సూపర్ ఉమెన్ అంటుంది. సమయపాలన ,కష్టపడే తత్వం, తనదైన ఒక ప్రత్యేకమైన హుందాతనంతో సమంత నా ఇన్స్పిరేషన్ అంటుంది.

Leave a comment