ఈ కాలంలో యువతకు వెండి తెర వేల్పులే రోల్ మోడల్స్. డ్రెస్సులు, నగలు, ఫ్యాషన్ లు, మేకప్ లతో వాల్లనే ఫాల్లో అవుతారు. మరి వాళ్ళు చెప్పే సలహాలు, అనుభవంతో చెప్పే కబుర్లు కూడా వినాలిగా సుధీర్గ కాలంగా చిత్ర పరిశ్రమలో వుంటూ, నాయకుల తో సమానంగా వెండి తెర పై నేగ్గుకొస్తున్న కధానాయిక అనుష్క ఒక విలువైన మాట సెలవిచ్చింది. కధానాయిక అందంగా వుంటే చాలదు. నాకోణంలో అది తప్పు. అందానికి తోడూ ఆరోగ్యం, సంతోషం కూడా కీలకమె దేహాన్ని మనసుని సమన్మాయ పరిచేందుకు రెండు అవసరమే అంటోంది ఆమె. అంద మన లోపల వుండే సౌందర్యం కంటే గొప్పది కాదు. మనస్సు అందంగా వుండాలి. అది మనం చేసే పనుల ద్వారా బయటకు తెలుస్తుంది. వాళ్ళకి వయస్సు కేవలం ఒక అంకె మాత్రమే. నాకు అలాగే వయసు, అందం గురించి అలోచ్చించడమే వృధా అనిపిస్తుంది అనుష్క. మనలో అందరికి మనసుంటుంది. దీన్ని అందంగా ఉంచడం కేవలం మన బాధ్యతే!!!

Leave a comment