అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాడటం ,నటించటం చాలా మంది వృత్తిగా తీసుకుంటారు. గొప్ప ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకోనూ వచ్చు. కానీ టేలర్ స్విఫ్ట్ గొప్ప దయాగుణ సంపన్నురాలు. శాడీ బార్టెల్ అనే ఒక మహిళా అభిమాని ట్విట్టర్ లో టేలర్ స్విఫ్ట్ ను ఆమె అభిమానులను అభ్యర్థిస్తూ ఒక మెసేజ్ పెట్టింది. మా అమ్మకు చాలా ప్రమాదంగా ఉంది అల్సర్ కారణంగా ఆమెకు రక్తస్రావం జరుగుతోంది ,మెదడుకు ఆక్సిజన్ అందక అది బ్రెయిన్ ప్రమాదంకు దారి తీసిందని. ఈ పోస్ట్ చూడగానే టేలర్ స్విఫ్ట్ వెంటనే 15000 డాలర్లు పంపేసింది.డబ్బు అందుకొన్న శాడీ ఈ విషయం వెంటనే ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ఒక ఆర్టిస్ట్ కు ఉండవలసిన దయా,కరుణా ఉన్నందుకు టేలర్ స్విఫ్ట్ ను మరింత మెచ్చుకొంటున్నారు అభిమానులు.

Leave a comment