మనసులో భావోద్వేగాలు వ్యక్తీరించేది ముఖమే.  మనసులో కోపాన్నీ ,సంతోషాన్ని బాధను ,అన్నింటినీ మొహం చక్కగా ప్రతి ఫలిస్తుంది. ముఖం రంగులో వచ్చే స్వల్ప తేడాల ఆధారంగా వ్యక్తుల బావోద్వేగాలు పసిగట్ట వచ్చని తీరా అధ్యయనాలు చెపుతున్నాయి. ముఖంలో కనిపించే భావోధ్వేగాల వ్యక్తీకరణ ,కేంద్రీయనాడీ వ్యవస్థ మధ్య సంబంధాలని పరిశీలించి వ్యక్తుల్లో భావోధ్వేగాలకు అనుగుణంగా ముఖంలోని రక్త ప్రసరణలో నిగూఢమైన తేడాలు ఏర్పడతాయని తెలిపారు. ఫలితంగా మొహంలో రంగులు మారి పోతాయన్నారు. మొహం నల్లబడి పోవడం కాంతి లేకుండా అయిపోవటం వంటి మార్పులు కూడా భావోధ్వేగాల ఫలితమేనంటున్నారు.

Leave a comment