లిబ్బీ స్మిత్ అద్భుతమైన ఆర్టిస్ట్.  ఆమె వికలాంగురాలు, కాస్త దృష్టిలోపం కూడా ఉంది.  తను చనిపోయే రోజు ఎంతో దగ్గర్లో ఉందని అర్ధం చేసుకున్న స్మిత్ తాను గీసే ప్రతి చిత్రం ఆదే ఆఖరుదన్నంత ఉదృతంగా చిత్రిస్తూ ఉంటుంది. మనం చూసే మనుషులు ఆమె చిత్రాల్లో కొత్తగా ఉంటారు. నిజానికి ఆమె ఓ ప్రకృతి దృశ్యాన్ని కూడా కళ్ళతో చూడనే లేదు. మనసు కళ్ళతో తాను ఊహించిన,చూసిన అందాన్ని దృష్టిలో ఉంచుకుని కాన్వాస్ పై తెస్తుంది ఆమె. కురూపి అన్న పదం ఆమె ఊహించదు. ఆమె ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే తాను గీసిన చిత్రాలు అమ్మగా వచ్చిన డబ్బు తోటి కళాకారులకు బహూకరిస్తు ఉంటుంది.ఆమె చిత్రాలే మాయా వాస్తవిక చిత్రాలు అంటారు విశ్లేషకులు.

Leave a comment