నీహారికా ,

కొన్ని వార్తలు చదువుతుంటే చాలా ఇన్స్పైరింగ్  గా ఉంటుంది . ఈ పదం విను వాల్స్ ఆఫ్ కైండ్ నెస్. తెలుగు లోచూస్తే మానవత్వపు గోడలు. ఇవి జైపూర్ అలహాబాద్ డెహ్రాడూన్ వంటి అనేక నగరాల్లో నెక్కీ  కీ దీవార్ పేరుతో కనిపిస్తాయి. ఆ గోడలకు అందంగా పెయింట్  చేసి మీకు అవసరం లేనివి ఇవ్వండి. మీకు కావలిసినవి పట్టుకుపోండి. అని కొటేషన్స్ రాస్తారు. గోడల నిండా హంగులుంటాయి. దాతలు తమకు ఉపయోగపడని దుప్పట్లు టోపీలు బట్టలు ఇలా తమకు అక్కర్లేనివి ఇతరులకు ఉపయోగపడతాయి అనుకున్నవి ఇక్కడ తగిలిస్తారు. పుస్తకాలూ చెప్పులు కూడా . ఈ సేవాతత్పరణ  దేశం అంతా పారుతుంది. రోడ్డు పక్కన నివసించేవారికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఇరాక్ పాకిస్థాన్ లోకూడా ఏ కాన్సప్ట్ మంచి ఫలితం ఇచ్చింది. ఇప్పుడు భోపాల్ లో మొదలుపెట్టారు. ఊరు పేరు దగ్గర నుంచి కృతజ్ఞతలు దొరుకుతాయి. దీని కోసం అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అందంగా పెయింట్  చేసిన చిన్న గోడ కొన్ని హ్యాంగర్లు   దానం ఇచ్చేవాళ్ళు ఇస్తారు. తీసుకునేవాళ్ళు తీసుకుంటారు. ఎలా వుంది చెప్పు. పేరే బావుంది. వాల్స్ ఆఫ్ కైండ్ నెస్. మానవత్వపు పరిమళాలు.

 

Leave a comment