1997లో విడుదలైన టైటానిక్ ను ప్రపంచం కళఖండం అని పొగిడింది.  1912లో టైటానిక్ ఓడ నార్త్ అంట్లాటిక్ లో మునిగి పోవటం నిజం.  కానీ అందులో రోజ్ అనే అమ్మాయి జాక్ డాసన్ అన్న అబ్బాయి మాత్రం కల్పితం .  జేమ్స్ కామెరూన్ రాసుకొన్న అందమైన , విషాదభరితమైన ప్రేమకథ ఇది.  20th సెంచురీ ఫాక్స్ నిర్మించిన ఈ టైటానిక్ సినిమా ప్రేక్షకులతో కన్నీళ్ళు పెట్టించింది.  11 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకొంది.  ఇక కలక్షన్ పరంగా చూస్తే 65,86,72,302 డాలర్లు వసూలు చేసింది.  రూపాయిల్లో 4000 కోట్లు .  ఉన్నతవర్గానికి చెందిన రోజ్ తనకు ఇష్టంలేని పెళ్ళిని తప్పిచుకొవటానికి తను ప్రయత్నం చేస్తున్న టైటానిక్ ఓడ నుంచి దూకాలని చూస్తే జాక్ అనే సరదా కుర్రాడు ఆమెను రక్షిస్తాడు . ఇద్దరూ ప్రెమించుకుంటారు.  ఓడ ప్రమాదంలో మునిగిపోతుంటే రోజ్ ను రక్షించి తాను సముద్రంలో కలిసి పోతాడు ఇదీ కథ. చూడకపోతే వెంటనే చూడండి.

Leave a comment