కొన్ని కొన్ని మంచి పనుల కోసం కొత్త కొత్త ఛాలెంజ్ లు ఇంటర్‌ నెట్ లో ట్రెండ్ అవుతుంటాయి. లవ్లీ ఫ్రేమ్ శాన్వీ నో స్ట్రా చాలెంజ్ కి ఓకే చెప్పానంటుంది. కూల్ డ్రింక్స్ కొబ్బరి నీళ్ళు తాగేటప్పుడు స్ట్రా వాడకపోవటం అన్నమాట. ఈ ఛాలెంజ్ వెనుక ఉన్న కథ గురించి మాట్లాడుతూ ఫ్రెండ్స్ తో కొబ్బరి నీళ్ళు స్ట్రా లేకుండా తాగుతానని సరదగా ఛాలెంజ్ చేశారు. మొదట్లో ఫెయిల్ అయినా ప్రాక్టీస్ చేసి సాధించాను. ఇది మంచిపనికి ఉపయోగపడలని నిర్ణయించుకుని కొబ్బరి నీళ్ళు కిందపడకుండా తాగే వీడియో తీసి నో స్ట్రా చాలెంజ్ అంటూ పోస్ట్ చేశాను. ప్లాస్టిక్ వినియోగానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. మనం మెల్లిమెల్లిగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకుని పర్యవరణాన్ని కాపాడుకోవచ్చు. శాన్వీ మంచి చాలెంజ్ తీసుకున్నట్లే.

Leave a comment