అరటి పండు ఏ కాలంలో అయినా దొరికేదే. ఇది పోషకాలకు నిలయం. చర్మానికి శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ బి6 సమృద్ధిగా ఉండి చర్మం మృదువుగా చక్కని ఎలాస్టిక్ ఉండేలా సహకరిస్తాయి. అరటి పండు లోని యాంటీ ఆక్సిడెంట్స్ వార్ధక్యం నుంచి చర్మాన్ని రక్షస్తాయి. వీటిలోని నీటి శాతం చర్మానికి తగిన హైడ్రెషన్ ఇస్తుంది. అరటి పండు గొప్ప మాయిశ్చరైజర్ . పండులోని విటమిన్ ఎ చర్మం కోల్పోయినా తేమను తిరిగి పొందేందుకు సహాకరిస్తుంది. అరటి పండు గుజ్జు ఫేస్ మాస్క్ లా చేసి ఓ ఆరగంట ఉంచి కడిగేస్తే చర్మానికి కావలసిన తేమ అంది చర్మం మెరుపుతో ఉంటుంది. చర్మంపై ఏర్పడే పిగ్నేంట్ కు ఇది చక్కని చికిత్స వంటిదే. అరటిపండు గుజ్జు ,పెరుగు ,తేనె బాధం పొడి కలిపి పేస్ట్ గా చేసి మొహాం ,మెడకు పట్టిస్తే చర్మానికి మాయిశ్చర్ లభించిటమే కాక అదనపు జిడ్డు కూడా పోయి మెరుపుతో ఉంటుంది.

Leave a comment