అరటి పండు ఆరోగ్యాన్ని ఇచ్చేదే . అయితే దీని గుజ్జు చర్మానికి చేసే మేలు అంత ఇంత కాదు . చర్మానికి పోషణ ,తాజా దనం ఇస్తుంది . పొడి చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసి మృదువుగా చేస్తుంది . స్కిన్ కు తేమ అందుతుంది . చర్మం పైన మృతకణాలు పోతాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం పైన గీతలు ముడతలు నివారించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి . పండులోని ఎ విటమిన్ ,జంక్ ,మాంగనీస్ లోని యాంటీ ఇన్ ప్లేమేటరీ గుణాలు ఉంటాయి . అరటి తొక్క లోపలి భాగాన్ని ముఖం పైన రుద్దుకొంటే నల్లమచ్చలు పోతాయి . అరటి పండు లోని సిలీకా ,కొల్లాజెన్ గ్రహించటంలో దోహద పడుతుంది . దీనిలోని కార్బొహేడ్రేట్స్ సహజ నూనెలు వెంట్రుకలకు పోషణ ఇస్తాయి .అరటి పండు గుజ్జు,శిరోజాలకు పట్టించి ఓ అరగంట వదిలేసి స్నానం చేసేస్తే చుండ్రు కూడా తగ్గిపోతుంది.

Leave a comment