మల్లిక గంగూలి అనే యువతి తన కన్నబిడ్డను హత్య చేసిన కేనసులో పిచ్చిదై జైల్లో ఉంటుంది. భాగ్యవంతుల కోడలు మల్లిక భర్తతో ఒక పెళ్ళికి వస్తు, ఊరు చూసేందుకు భర్తతో కలిసి టాక్సీ ఎక్కుతుంది. అద్భుత సౌందర్యరాలైన మల్లికను భర్త టాక్సీ దిగిన వెంటనే స్పీడ్ గా కారు నడిపి కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసి రోడ్డు పైన పడేస్తాడు ఆ డ్రైవర్. అత్తింటి వారు ఈ సంఘటనను మరిచిపోయి ఆమెను ఆధరించినా మల్లిక ఆనాటి తన పతనాన్నీ మరిచిపోలేక పిచ్చిదై పుట్టిన బిడ్డలోనూ తనపై అత్యాచారం చేసిన మనిషి కనిపించి పసివాడిని చంపేస్తుంది. ఈ రచయిత నవలను ఇతర అన్ని భాషల్లోకి తర్జుమ అయ్యాయి. ఈ నవల ఇంగ్లీష్ లో దొరుకుతోంది. రచయిత జరాసంధ పోలాస్ డిపార్ట్ మెంట్ లో ఉన్నాతోద్యోగి. గొప్ప రచయిత.

Leave a comment