మంచి నిద్రకు ఆహారానికీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా ప్రభావం చూపించక పోయినా పరోక్షంగా ఆరోగ్యాన్ని దాని ద్వారా నిద్రనూ దెబ్బ తీస్తాయి. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం మాత్రం సంపూర్ణాహారం అని మనం పిలిచే పాలు ఒకటే. ఇందులో అన్ని పోషకాలతో పాటు ట్రెప్టోఫాన్ ,అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇవి గోరువెచ్చగా ఉండేలా నిద్రకు ఉపక్రమించేముందర తీసుకోవాలి. అలాగే ఓట్ మీల్ వరి వంటి కార్బోహైడ్రేట్స్ తిన్నాక కూడా నిద్రవస్తుంది. వీటిలోని మెలటోనిన్ అనే పదార్ధం కండరాలకు రిలాక్స్ చేసి నిద్రను ఇస్తుంది. అలాగే విటమిన్ సి వుండే బొప్పాయి అనాస నిమ్మజాతి పండ్లు సెలెరియం ఎక్కువగా వుండే చేపలు బాదాం వంటి నట్స్ కూడా ఆరోగ్యకరమైన నిద్రను ప్రోత్సహిస్తాయి. బెడ్ రూమ్ నిశబ్ధంగా ప్రశాంతంగా వుంది. మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా ఉండాలి. ఎక్కువ వెలుగు లేకుండా ఉండాలి మసక చీకట్లో నిద్రకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదల అవుతోంది.
Categories
Wahrevaa

మంచి నిద్రకు మంచి భోజనం వాతావరణం

Leave a comment