కెరీర్ ఆరంభలోనే అక్కినేని కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములతో నటించటం చాలా ఆనందంగా ఉంది ,సవ్యసాచి వెంటనే మజ్నూ చేశాను. సవ్యసాచి కంటే మజ్ను కోసం ఎక్కువ కష్టపడ్డాను.నా కష్టం సినిమాలో తెలుస్తుంది అంటోంది నిధి అగర్వాల్ .ఇప్పుడే కేరీర్ ప్రారంభించాను.కనుక ఎలాంటి పాత్రలు చేయాలో నిర్ణయించుకోలేదు. సినిమా ఒప్ఫుకునే ముందర నాపాత్ర ఏమిటన్నది చూస్తాను కానీ ఎక్కువ గ్లామర్ రోల్స్ వస్తున్నాయి.అందంగా కనిపిస్తూనే అభినయానికి ప్రధాన్యత ఉన్న సినిమాలు వస్తే బావుంటుంది. చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలన్న కృషి చేశాను.బాలే,కథక్ నృత్యాలు నేర్చుకున్నాను.చదువుతూ మోడలింగ్ చేశాను . తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చేసిన సినిమాలో కెరీర్ కు పెద్దగా ప్లస్ కాకపోయినా మానసిక సంతృప్తి ఇచ్చాయి అంటోంది నిధి అగర్వాల్.

Leave a comment